Wednesday, May 26, 2010

శ్రీ శ్రీ కి జన్మదిన శుభాకాంక్షలతో ..


పేదోడి స్వేదానివై ... కార్మికుడి నాదనివై ... అణుగారిన వర్గాల వాదనివై ... అభాగ్యుల పాలిట వేదానివై ... అస్సహయుల ఘోషలో ఆవేశపు శ్వాసవై... నిస్సహాయుల బాధలో అక్రోశపు రాతవై ... జ్వలించే గుండెలో స్కలించే లావవై .... అశ్రువులను అక్షరాలుగా... కన్నీళ్లను కవిత్వంగా... అనువదిస్తూ.... నీ కలం ఇక సామాన్యుని బలమై ... సతమతాల సమాజాన్ని నిలదీస్తూ శ్రామికుడి గళమై... అసమర్ధపు ప్రభుత్వం పై నినాదిస్తూ. ... కర్షకుడి హలమై ... బండబారిన భూమిని మొండిగా చీలుస్తూ ...... విశాల భారతావని నుదిట నెత్తుటి తిలక0 దిద్దగా మళ్లీ ఎప్పుడు వస్తావ్ ప్రభు.... మేఘాలను దాటి... రాగాలను మీటి .. పంచభూతాలు ప్రళయ గీతాలు ఆలపించగా... అష్ట దిక్కులు విలయ నాట్యం చెయ్యగా ... శూన్యంలో నుంచు సుధీర్గ ప్రయాణం చేస్తూ... దండెత్తి రా ప్రభు మా భూమికి .. మరో ప్రపంచపు పరుగులలో విశ్రమించని కవివై .. మహాప్రస్తానపు వెలుగులలో అస్తమించని రవివై .. మహా కవి శ్రీ..శ్రీ..గారికి జన్మదిన శుభాకాంక్షలతో .... రాజశేఖర్...!

No comments: