Tuesday, June 1, 2010

అమెరికాలో అందమైన భవిష్యత్తు కోసం...

అమెరికాలో అందమైన భవిష్యత్తు కోసం...

అందమైన భవిష్యత్తును వెదుక్కుటూ వేలాదిగా యువతీయువకులు అమెరికా వెళ్తున్నారు. అక్కడి పరిస్థితులపై సరైన అవగాహన లేకపోతే ఇబ్బందులకు గురి కావలసి ఉంటుంది. అంతా బాగానే ఉంటే బంగారు భవిష్యత్తుకు ఢోకా లేదు. కాని అమెరికాలో గాని, మరో దేశంలోగాని ఎక్కడైనా ఏ చిన్న పొరపాటు జరిగినా, చివరికి ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి.

ఈమధ్య కాలంలో అమెరికాలో జరుగుతున్న దుర్ఘటనలు చూస్తుంటే చాలావరకు పరిస్థితులపై సదవగాహన లేకే పిల్లల జీవితాలు అర్థంతరంగా ముగిసిపోతున్నాయని అర్థమవుతున్నది. అందుకే అమెరికా వెళ్లాలనుకునే యువతీ యువకులే కాదు, వారి మిత్రులు, తల్లిదండ్రులు కూడా ఈ మార్గదర్శక సూత్రాలను అనుక్షణం గుర్తుంచుకోవాలి.

navya. వాగ్యుద్ధాలు వద్దు
1. అపరిచితులతో వాగ్వివాదాలు వద్దు. చాలారకాల అభిప్రాయభేదాలు వాగ్యుద్ధంగా మారి ఒకరినొకరు కొట్టుకునే స్ధాయికి చేరతాయి. వాటివల్ల ఉత్తరోత్రా ప్రత్యర్ధి కన్నా మీకే ఎక్కువ నష్టం అన్న విషయం మరిచిపోకండి.

2. అభ్యంతరకరమైన సంజ్ఞలు చేయకండి (ముఖ్యంగా మధ్యవేలు, చూపుడువేలు చూపించటం లాంటివి). తిట్లు, బూతుమాటలు వాడకండి. పొరపాటు అవతలివారిదే అయినా, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. రెండు క్షణాలు నిగ్రహం పాటించగలిగితే పరిస్ధితి దానంతటదే చక్కబడుతుంది. గొడవలు పడకుండా పరిష్కరించుకునే పద్ధ్దతులు చాలా ఉంటాయి.

3. మొరటుగా బెదిరిస్తూ డబ్బు, విలువైన వస్తువులను బలవంతంగా లాక్కునే దొంగలుగానీ, దుండగులుగానీ ఎదురుపడితే ఎంతమాత్రం ప్రతిఘటించకుండా జేబులో ఉన్నవి ఇచ్చేయటం మంచిది. డబ్బుపోతే సంపాదించుకోవచ్చు, విలువైన ప్రాణంపోతే తిరిగి రాదు.

4. తోటి భారతీయులు తారసపడితే, కొంతమంది ఇంగ్లీషులో కాక భారతీయ భాషల్లోనే మాట్లాడుతారు. వీరి భాష పక్కనున్న ఇతరులకు అర్ధంకాక అపార్ధం చేసుకొని గొడవలు పడిన సందర్భాలు అమెరికాలో చాలానే ఉన్నాయి. అందువల్ల బయట ప్రదేశాలలో ఇంగ్లీషులో మాట్లాడితేనే మంచిది.

5. ఎదుటివారిని, ముఖ్యంగా అపరచితులను పరిశీలిస్తున్నట్టు కళ్ళప్పగించటం, తేరిపార చూడటం మంచిది కాదు. వారు నొచ్చుకునే అవకాశం ఉంది, ఈ చూపులు కూడా సమస్యలను తెచ్చిపెడతాయి.

6. లోకల్ విద్యార్ధులతోను, ప్రాంతీయులందరితోను కలిసిమెలసి గడిపే ప్రయత్నం చేయండి. అప్పుడు వాళ్లకి మీరు పరాయివారన్న భావన తగ్గుతుంది. భారతీయులతో మాత్రమే కలిసిమెలసి గడిపితే లోకల్‌వారికి మీరు పరాయి అన్న అభిప్రాయమే కలుగుతుంది.

సరయిన అవగాహన, ప్రణాళికాబద్ధ్ద జీవనం మిమ్మల్ని, మీ కుటుంబసభ్యుల్ని ఎన్నో రకాల విపత్తుల నుంచి కాపాడుతాయి. అమెరికాలో ఎదురయ్యే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అందరికీ ఉపయుక్తంగా ఉండేటట్టు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఈ మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. అమెరికాలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు తానా అత్యవసర సహాయక బృందం (తానా ఎమర్జెన్సీ అసిస్టెన్స్ఆండ్ మానేజ్‌మెంట్ టీమ్-టీమ్ స్క్వేర్) ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని కూడా తానా అధ్యక్షుడు జయరాం కోమటి, ప్రెసిడెంట్ ఎలక్ట్ ప్రసాద్ తోటకూర, కార్యదర్శి మోహన్ నన్నపనేని ఆంధ్రజ్యోతికి తెలియజేశారు.

navya. డ్రైవింగ్
1. చట్టం చెప్పినా చెప్పకపోయినా, ఎప్పుడూ సీట్‌బెల్ట్ పెట్టుకోవాలి. కారులో ముందు సీట్లోనే కాక వెనక సీట్లో కూచున్నా సీట్‌బెల్ట్ పెట్టుకోవాలి. సీట్‌బెల్ట్ పెట్టుకోవటం వల్ల అత్యంత పెద్ద ప్రమాదాల్లో కూడా రక్షణ ఉంటుంది.

2. సరైన డ్రైవింగ్ లైసెన్స్, భీమా లేకుండా అమెరికాలో కారు నడపకండి.

3. భారతదేశంలో కారు నడిపే అనుభవం ఎంతగా ఉన్నా, అమెరికాలో కారు నడిపే ముందు. డ్రైవింగ్ పాఠాలు తప్పనిసరిగా నేర్చుకోవాలి. ప్రాథమిక అవగాహన, నియమనిబంధనలు, పాటించాల్సిన వేగం మొదలైన వివరాలు అర్ధమవుతాయి. అలాకాని పక్షంలో కంగారు, అయోమయం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తగిన డ్రైవింగ్ తర్పీదు తప్పనిసరి. మరీ ముఖ్యంగా భారత దేశంలో కారు స్టీరింగ్ కుడివైపు ఉంటుంది. అమెరికాలో ఎడమవైపు ఉంటుంది. ఇది తొలిరోజుల్లో చాలా అయోమయానికి దారితీస్తుంది.

4. వీలైనంత వరకూ రాత్రి ప్రయాణాలను మానేయండి. మీరు పూర్తి జాగ్రత్తతో సమర్ధవంతంగా కారు నడిపినా, రాత్రి వేళల్లో కారు నడిపే తాగుబోతులు రాంగ్ రూట్‌లో వచ్చి యాక్సిడెంట్ చేసే ప్రమాదం ఉంది.

5. మీ కారు ముందుకు నడపలేని స్ధితిలో తప్ప బ్రేక్ డౌన్ కోసం నిర్దారించిన స్ధలాలలో కారు నిలపకండి. ఒకవేళ బ్రేక్ డౌన్ అయి అలా నిలిపితే, కారులోంచి దిగి ట్రాఫిక్‌కి దూరంగా సురక్షిత స్ధలానికి చేరటం మరువకండి.

6. ఎవరైనా పోలీసు అధికారి మీ కారు ఆపితే, ఆగగానే కారులోంచి దిగకండి. మీ చేతులు స్టీరింగ్ మీదే ఉంచి, పోలీసు ఆదేశాల కోసం వేచి చూడండి.

7. భారతదేశంలో కన్నా అమెరికాలో పాదచారులకి హక్కులు ఎక్కువ. అందువల్ల నడిస్తున్నవారిని గౌరవించడం, వారికి మన కారు తగలకుండా చూసుకోవడం చాలా అవసరం. నడిచివెళ్లేవారికి అలా నడిచే హక్కు లేదన్నట్టు ప్రవర్తించకండి.

8. కారు నడిపేప్పుడు, భద్రతకి అవరోధం కలిగించనంత దూరంలో కారు ఆగేలా మీ డ్రైవింగ్ ఉండాలి. అది అమెరికా డ్రైవింగ్‌లో ప్రాథమిక సూత్రం. ఈ దూరం ఎంత అన్నది, వాతావరణం పరిస్ధితుల మీద ఆధారపడి ఉంటుంది.

9. దారిలో ఏదయినా కారు ప్రమాదం కంటబడితే, స్వయంగా వారిని రక్షించాలనుకుని అనాలోచితంగా పరుగులు తీయకండి. తగిన జాగ్రత్త శిక్షణ లేకపోతే ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంకన్నా హానే ఎక్కువ జరుగుతుంది.

12. కారు నడుపుతూ టెక్ట్స్, ఎస్.ఎం.ఎస్.లకి సెల్‌ఫోన్‌లు వినియోగించకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్ వాడకం అమెరికాలో చాలాచోట్ల నిషిద్దం. అందువల్ల ప్రాంతీయ చట్టాలను తెలుసుకోండి.

navya. అపార్ ్టమెంట్, ఇల్లు, డార్మ్ రూమ్
1. ఎప్పుడూ మీ అపార్ట్‌మెంట్, ఇల్లు, డార్మ్ తలుపులు (క్రిందగానీ, మొదటి అంతస్థుగానీ అయితే కిటికీ తలుపులతో సహా) భద్రంగా తాళాలు వేయండి.

2. పొగ త్రాగటానికో, పార్టీలలో వంటలు చెయ్యటానికో స్మోక్ డిటెక్టర్స్ కనక్షన్ తొలగించటం, బద్దలు కొట్టడం లేదా ఆపటం చాలా ప్రమాదకరం.

3. గత కొంతకాలంగా అమెరికాలో దొంగలకి భారతీయుల ఇళ్ళు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనవాళ్లకి ఖరీదైన నగలను ఇళ్ళలో పెట్టుకోవటం అలవాటు. అది దొంగలకీ తెలుసు. పార్టీలలోనూ ముఖ్య సమావేశాలలోను మనవాళ్ల నగలు చూసి, దొంగలు వెంటాడి వచ్చిన సంఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. మీ విలువైన న గలు, పత్రాలు, ఇళ్ళలో, అపార్ట్‌మెంట్లలో ఉంచుకోవద్దు, సేఫ్ డిపాజిట్ బాక్సు (లాకర్స్) భద్రమైనది. దానికి అయ్యే ఖర్చు తక్కువే కాక మీకు మీ ఆస్తికి ఎంతో భద్రత.

4. అత్యవసర సమయంలో వచ్చి సహాయపడటానికి వీలుగా, మీకు బాగా నమ్మకస్తుడైన వ్యక్తి దగ్గర మీ ఇంటి మారు తాళం ఉండే ఏర్పాటు చేసుకోండి.

చట్టబద్ధ్ద ప్రవర్తన
1. చట్ట ప్రకారమే నడుచుకోండి. అమెరికాలో ఉన్నంత వరకూ ప్రాంతీయ చట్ట విధానాలకు కట్టుబడి ప్రవర్తించటం అవసరం. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు చేస్తే చట్టం నుంచి తప్పించుకునే అవకాశం లేదు.

2. ఒంటరిగా ఉన్న పసి పిల్లల జోలికి వెళ్ళకండి. మీ పక్కింటి పిల్లలైనా సరే, ఒంటరిగా ఉన్నప్పుడు వారి దగ్గరకు వెళ్ళటం అమెరికా సమాజంలో నిషిద్ధం. పిల్లలను ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేయవద్దు.

3. పిల్లలతో ఉన్న తల్లిదండ్రులుగానీ, పెద్దలుగానీ అనుమతిస్తే తప్ప పిల్లలకి తినుబండారాలు, పానీయాలు ఇవ్వకండి. 4. బహిరంగ ప్రదేశాల్లో, స్వీమ్మింగ్‌పూల్స్‌లో,థియేటర్లలో అపరిచితులను ముట్టుకోవటం గానీ వారిని రాసుకుని వెళ్ళటం కానీ, వారివైపు తదేకంగా చూడడం కాని చేయకండి.

5. ఎట్టి పరిస్థితులలోనూ ఒకరి తరపున మరొకరు దొంగ సంతకాలకు పాల్పడకండి.

6. ఒకవేళ దారి తప్పినా, ఇతరుల ఇళ్ల ప్రాంగణాలలోకి వెళ్ళకూడదు, వాళ్ళ తలుపులు తట్టకూడదు.

గృహ హింస
ఇతరులను హింసించటం అమెరికాలో చట్ట వ్యతిరేకం. ఎదుటివారి అనుమతి, ఇష్టం లేకుండా ముట్టకోవడం కూడా నిర్బంధ హింసగానే పరిగణిస్తారు. చట్టప్రకారం ఆ నిర్వచనం ఎంతో విపులంగా ఉంది. గృహహింసని అమెరికాలో చాలా తీవ్రంగా పరిగణిస్తారు.

1.అభిప్రాయభేదం, ఘర్షణ పడటం జరిగితే మొరటుతనానికి కానీ, శారీరక హింసకి కానీ దిగవద్దు. చిన్న తప్పిదం కూడా కెరియర్ మొత్తాన్నే కాక జీవితాన్నే నాశనం చేస్తుంది.

2. మీ భాగస్వామిని లేదా స్నేహితుల్ని, తదితర కుటుంబసభ్యుల్ని కోపంగా గట్టిగా తాకవద్దు, మీ వల్ల వారికి చిన్నపాటి దెబ్బ కూడా తగలకూడదు.

3. మీరు గృహహింసను ఎదుర్కొంటే వెంటనే సహాయాన్ని ఆర్ధించండి. దేశం మొత్తంగా ఎన్నో భారతీయ సంస్ధలు మీకు సహాయం చెయ్యటానికి సిద్దంగా ఉన్నాయి. గృహ హింస బాధితుల్ని ఆదుకోవటానికి ప్రతిచోట ప్రాంతీయ సంస్ధలు చాలా ఉన్నాయి.

తల్లిదండ్రులు, బంధువులతో జాగ్రత్త
1. పరిసరాలకి పూర్తిగా అలవాటు పడే వరకూ మీ తల్లిదండ్రులను, బంధువులను ఒంటరిగా వదలకండి.

2. సురక్షితం కానిప్రదేశాలలో వారిని ఒంటరిగా తిరగనివ్వకండి. మీ ఇంటి చుట్టపక్కల వారితో ప్రమాదం లేకపోయినా, ఇతర ప్రదేశాల నుంచి వచ్చే అగంతకుల వల్ల ప్రమాదం ఉండవచ్చు.

3. వారు మీ దగ్గర అతి తక్కువ కాలం గడపటానికి వచ్చినా, వారికి ఆరోగ్య భీమా తప్పనిసరిగా ఉండేలా చూడండి.

పిల్లలు
1.ఇంట్లోగానీ, కారులోగానీ, కారు వెలుపలగానీ పిల్లల్ని ఒంటరిగా వదలకండి.

2.ఏ షాపులోకో వెళ్ళినప్పుడు, కారులో ఒంటరిగా వదిలిన మీ పిల్లలు మీకు కనబడే దూరంలో ఉన్నా, వారిని అలా వదలకండి. అమెరికాలో చాలాచోట్ల చట్టరీత్యా అది నిషిద్దం కూడా.

3. మీ పిల్లలే కదా అని మొరటుగా, కర్కశంగా ప్రవర్తించటం, కొట్టటం లాంటి చర్యలకి పాల్పడకండి.

4. చిన్నపిల్లలకి అందేలా ఏ ప్రమాదకర వస్తవునూ వదలకండి.

5. పిల్లలకి ప్రమాదకరమైన ఆల్కహాల్ లాంటివి అందుబాటులో లేకుండా జాగ్రత్తపడండి. అటువంటివాటిని తాళం వేసి భద్రపరచటం మంచిది. పిల్లల విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్త అవసరం.

ఆరోగ్య, జీవిత మరియు ఆటో భీమాలు
1. వీసా కాలపరిమితి ఎంత తక్కువ కాలమయినా, అమెరికాలో ఉన్నన్ని రోజులు మంచి ఆరోగ్య భీమా ఉండటం ఎంతో అవసరం. అమెరికాలో వైద్యం ఎంతో ఖరీదు. ఇన్సూరెన్స్ లేకపోతే చాలామందికి భరించలేనంత ఖర్చు, సరైన ఆరోగ్యభీమా చేయించుకోని అశ్రద్ద వల్ల హెచ్-1, హెల్-1 తాత్కాలిక వీసాలతో అమెరికా వచ్చిన విద్యార్ధులు తీవ్రమైన ఇబ్బందుల పాలయిన సందర్భాలు అసంఖ్యాకం.

2. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులయినా రేపేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. గత ఆరు నెలల్లో 35 ఏళ్ళ వయసులోపు భారతీయులు మాసివ్ హార్ట్ఎటాక్‌తో మరణించిన సందర్భాలు పన్నెండు పైగా ఉన్నాయి.

3. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ధికంగా చాలామందికి అందుబాటులో ఉండే ప్రీమియం లభిస్తుంది. ముప్పై అయిదేళ్ళలోపు వయసు వారికి లక్ష డాలర్ల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి రెండుసార్లు రెస్టారెంట్‌లో పెట్టే ఖర్చుకి వచ్చేస్తుంది.అటువంటి భీమా సౌకర్యం, మీ దగ్గరవారిని తీవ్ర ఇబ్బంది నుంచి కాపాడుతుంది.

4. మీరు ఏదయినా సంస్ధకి లేదా కంపెనీకి చెందిన వారయితే, ఆ సంస్ధ ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ మరియు డిసెబిలిటీ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉందేమో తెలుసుకోండి. గ్రూప్ పాలసీలు చౌకగా లభిస్తాయి. అయితే, మీరు ఆ సంస్ధలో పనిచేస్తున్నంత వరకే ఆ భీమా సౌకర్యం ఉంటుందన్న విషయం గుర్తుంచుకోండి.

5. మంచి ఆటోమొబైల్ ఇన్సూరెన్స్ అత్యవసరం. ప్రాంతీయ చట్టాల ప్రకారం ఎంతో కొంత భీమా తప్పనిసరిగా ఉన్నా, మరికొంత భీమా థర్డ్‌పార్టీగా లేదా అంబ్రెల్లా కవరేజ్‌గా ఉండటం మంచిది.

బేంకింగ్, విల్లులు మరియు అత్యవసర వివరాలు
1. మీ వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని, అత్యవసర పరిస్ధితిలో సంప్రదించాల్సిన వివరాలను మీ సెల్‌ఫోన్‌లో మరియు పర్స్‌లో పొందుపరిచి ఉంచండి. మీ సెల్ ఫోన్‌లో ఐసిఇ( ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ) అని ఈ సమాచారాన్ని పొందుపరచవచ్చు.

2. మీ ఆర్దిక, వైవాహిక, వయో స్ధితి ఎలాంటివయినా మీరు విల్లు రాయటం ఎంతో మంచిది.

3. షూటింగ్ రేంజెస్, గన్ క్లబ్స్‌లో పాల్గొనే ముందు భద్రతాపరమైన తర్ఫీదుని తప్పనిసరిగా తీసుకోండి.

4. జలసంబంధమయిన వినోదాలు అంటే వైట్ వాటర్ రాఫ్టింగ్, ఫినిషింగ్, కేనింగ్ లాంటి సరదాలలో సేప్టీ జాకెట్స్ తప్పనిసరిగా ధరించండి.

5. మీరు పాల్గొనే క్రీడలకు తగిన పరికరాలు మంచి స్ధితిలో ఉన్నవి ఎంచుకోండి.

Monday, May 31, 2010

ఓ మనిషీ మేలుకో!మనుగడో, మరణమో తేల్చుకో..2050 నాటికి ఎటు చూసినా ఆకలి రాజ్యాలే..!!
ఐదు భూగ్రహాలుంటే గానీ అవసరాలు తీరవు..
దిగుబడులు రెట్టింపు చేస్తేనే కడుపు నిండేది.
శరవేగంగా అంతరిస్తున్న జీవ, వృక్షజాలం..
మిగిలేది చేపలు లేని సముద్రాలే..
ఆసియా, ఆఫ్రికా దేశాలకే ఎక్కువ ప్రమాదం

క్రీస్తు శకం... 2050. మరెంతో దూరం లేదు! ఇంకో నలభై ఏళ్లు! నేటి యువకులు నాటికి వృద్ధులవుతారు. పిల్లలు నడివయస్సులోకి వస్తారు. ఇప్పుడున్న వాళ్లలో చాలామంది అప్పటికి ఉండకపోవచ్చు. కానీ, ఈ భూమి మాత్రం ఉంటుంది. కానీ, ఎలా ఉంటుందో తెలుసా!?
ఆకలితో నకనకలాడుతుంటుంది. అగ్నిగోళంలా మండుతుంటుంది. నీళ్లు పాతాళంలో కదలాడుతుంటాయి. ధరలు అంతరిక్షంలో విహరిస్తుంటాయి. పచ్చదనం కోసం ప్రత్యేక అన్వేషణ సాగించాల్సి ఉంటుంది. కొన్ని నదులు చరిత్రలో కలిసిపోయి ఉంటాయి. కొన్ని లక్షల రకాల జీవ, వృక్ష జాలాలు అంతరించిపోతాయి. ఇవి అతిశయోక్తులు, అతి భయాలూ కావు! అంతర్జాతీయ ఆహార విధానం, పరిశోధన సంస్థ (ఐఎఫ్ఆర్ఐ), ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థతోపాటు పలు సంస్థలు, పర్యావరణ నిపుణులు చేస్తున్న హెచ్చరికలివి. వేస్తున్న అంచనాలివి!

2008లో ఓ మోస్తరు దుర్భిక్షానికే ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది ఆకలితో అలమటించారు. గత ఏడాది 97 కోట్ల మంది పౌష్టికాహారలోపంతో సతమతమయ్యారు. మరి... 2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లను దాటుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆహారోత్పత్తిని రెట్టింపు చేస్తే మినహా... వీరందరి కడుపులు నిండవు. ఈ 900 కోట్ల మంది ఏ లోటూ లేకుండా, ప్రస్తుత అమెరికన్ల తరహా జీవన విధానం అనుసరించాలంటే... ఈ భూమిపై ఉన్న వనరులు సరిపోవు.

భూమిలాంటి గ్రహాలు మరో ఐదు కావాలి. కానీ... మనకు ఏకైక దిక్కు ఈ భూమి! అప్పటికి ఈ భూమి మరింత నిస్సారంగా, మరింత నిర్జీవంగా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా... 2050 నాటికి 25 లక్షల మంది పిల్లలు ఆకలితో నకనకలాడతారు. మరీ ముఖ్యంగా భారత్‌తో సహా దక్షిణాసియా, ఆఫ్రికా దేశాలు ఆకలిరాజ్యాలుగా మారనున్నాయి. ఈ దేశాల్లో పంట దిగుబడులు భారీగా పడిపోతాయని ఐఎఫ్‌పీఆర్ఐ అంచనా వేసింది.

ఎందుకంటే, పిల్లలకు 2000లో లభిస్తున్న కేలరీలకంటే 2050లో తక్కువ కేలరీలను ఆహారంగా తీసుకుంటారు. ఇది అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు. కొన్ని దశాబ్దాలపాటు సాధించిన ప్రగతి... చిన్నారుల పౌష్టికాహార లోపం రూపంలో తుడిచిపెట్టుకుపోతుంది.

నీరసం నిండిన 'రేపటి పౌరుల'తో ప్రపంచం ఏం ముందుకు పోతుంది! అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఒక్కొక్కరికీ అందుబాటులో ఉండే ఆహారం తగ్గిపోతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2696 కేలరీల నుంచి 2410 కేలరీలకు.. ఆఫ్రికాదేశాల్లో 2316 కేలరీల నుంచి 1924 కేలరీలకు పడిపోతుంది. 2050నాటి సంగతి వదిలేద్దాం! కెన్యా, ఇథియోపియా, సోమాలియా, ఉగాండా తదితరదేశాల్లో పదేళ్లుగా తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. ఈ దేశాల్లో సుమారు 2.3 కోట్ల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ముందుముందు ప్రపంచపటంలో మరిన్ని ఇథియోపియాలు, సోమాలియాలు, ఉగాండాలు కనిపించనున్నాయి.

దిగుబడులు పెరిగేదెలా?
2050 నాటికి దిగుబడులను రెట్టింపు చేస్తే తప్ప మనుషుల ఆకలి తీరదు! కానీ... దిగుబడుల గతి నానాటికి దిగదుడుపుగానే ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ మార్పు, సారంలేని భూమి, అందుబాటులో లేని నీరు... వంటి అంశాలే కారణం. దీనివల్ల కెనడా, రష్యాలాంటి దేశాల్లో పంట దిగుబడి కాలం బాగా పెరుగుతుంది. దిగుబడి బాగా తగ్గుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రధాన ఆహార పంట అయిన గోధుమ దిగుబడి పెరగడం మాట అటుంచి తగ్గుతుంది.

సముద్ర మట్టాలు పెరిగి సాగుకు వినియోగమయ్యే భూమి భారీ స్థాయిలో మునిగిపోతుంది. ఈ మట్టం మూడు అడుగులు పెరిగితే బంగ్లాదేశ్‌లోని సాగుభూమిలో సగం మునిగిపోతుంది. ఇక... వరి దిగుబడిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న వియత్నాంలోని అధికభాగం నీట మునిగే అవకాశముంది. గంగ, సింధూ, యాంగ్జే వంటి నదులను సజీవంగా ఉంచే హిమాలయాల్లోని హిమనీ నదాలు కరిగిపోతున్నాయి. దీంతో ఈ నదీపరీవాహక ప్రాంతాల్లో సాగు ప్రశ్నార్థకమౌతుంది. ఆహార భద్రతకు ఇదే అతి పెద్ద ముప్పు. "ఇదో నిశ్శబ్ద సునామీ! ప్రపంచ దేశాలన్నీ ఆహార భద్రతకు తొలి ప్రాధాన్యమిస్తే తప్ప... 2050 నాటికి అందరి ఆకలి తీర్చలేం''అని ఐరాస హెచ్చరిస్తోంది.

జీవంలేని జాలం...
'జీవ వైవిధ్యం లేకున్నా మనుగడ సాధించగలం' అనే భ్రమల్లో మనిషి మునిగిపోయాడు. జీవ, జంతుజాలాన్ని అంతం చేస్తున్నాడు. 'అడవులు శరవేగంగా క్షీణిస్తాయి. జల వనరులను ఆల్గే (నాచు) ఆక్రమిస్తుంది. కోరల్ రీఫ్స్ (పగడపు దీవులు) సామూహికంగా అంతరిస్తాయి' అని గ్లోబల్ బయోడైవర్సిటీ ఔట్‌లుక్ (జీబీవో-3) ఇటీవలే హెచ్చరించింది. 1970తో పోల్చితే 2006 నాటికి అన్ని రకాల పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు, ఉభయ చరాల వంటి జీవులు మూడోవంతు పడిపోయినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. నిజానికి.. ఏటా 2 నుంచి 5 లక్షల కోట్ల డాలర్ల విలువైన అడవులు అంతరిస్తున్నాయి. కేవలం 20 ఏళ్లలో 35 శాతం మడ అడవులు అంతరించాయి. 5490 క్షీరదాల్లో 79 రకాల క్షీరదాలు అంతరించాయి. ఇవన్నీ... మనిషిని సైతం అంతరించేలా చేసే విపరిణామాలే! మనమూ అంతరిద్దామా?

చేపలన్నీ ఖాళీ!
పర్యావరణ ప్రమాదాలపై ఇప్పటిదాకా వస్తున్న అంచనాలన్నీ నిజమైతే... 2050 నాటికి చేపలు లేని సముద్రాలే మిగులుతాయి. ప్రపంచవ్యాప్తంగా మత్స్య పరిశ్రమకు విచ్చలవిడిగా ఇస్తున్న సబ్సిడీలకు కోత వేసి, చేపలకు రక్షిత ప్రాంతాలను (ప్రొటెక్టెడ్ జోన్స్) ఏర్పాటు చేస్తే మినహా మత్స్య సంపదను కాపాడుకోలేమని స్పష్టం చేశారు.

పది పర్యావరణ పాపాలు
1. గ్రీన్ హౌస్ వాయువులు
గ్రీన్‌హౌస్ వాయువులు ఇబ్బడి ముబ్బడిగా పెంచడం అతిపెద్ద పా పం. శిలాజ ఇంధన వినియోగం బాగా పెరిగిపోవడంతో భూతాపాన్ని తగ్గించలేని విషమ స్థితికి మానవ జాతి చేరుకుంటోందని 1963 సదస్సు నుంచి శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నారు.

2. వియత్నాం జీవవిధ్వంసం
వియత్నాం యుద్ధం సందర్భంగా అమెరికా సైన్యం విష రసాయనాలను ప్రయోగించింది. వీటిలో అత్యంత ప్ర మాదకరమైనది ఏజెంట్ ఆరెంజ్! వియ త్నాం యుద్ధంలో ఏజెంట్ ఆరెంజ్ ఒక్క టే 48 లక్షల వియత్నాంవాసులపై ప్రభావం చూపింది. ఈ రసాయనాలు ఆ ప్రాంత పర్యావరణాన్నీ దారుణంగా దెబ్బతీశాయి. దీని నుంచే జీవ విధ్వంసం (ఎకోసైడ్) అనే పదం పుట్టింది.

3. భోపాల్ గ్యాస్ విషాదం
ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పారిశ్రామిక ఉపద్రవం భోపాల్ గ్యాస్ విషాదం. 1984 డిసెంబర్ మూడో తేదీన భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ప్లాంట్ నుంచి 32 టన్నుల విష వాయువులు లీకయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తం 20వేల మంది మరణించగా, లక్షల మంది జీవచ్ఛవాలయ్యారు.

4. సరస్సుకు ఉరి
విక్టోరియా సర స్సు ఆఫ్రికాలోనే అతిపెద్ద సరస్సు. కానీ, పర్యావరణ విధ్వంసం కారణంగా నెమ్మదిగా ఇది జీవాన్ని కోల్పోతోంది. కొన్ని ప్రాంతాల్లో ఈ సరస్సు ఏడాదికి 150 అడుగుల చొప్పున కుంగిపోతోంది. ఈ పర్యావరణ విధ్వంసం వలన, ఈ సరస్సుపై ఆధారపడిన నాలుగు కోట్లమంది భవిత ప్రశ్నార్థకం.

5. చెర్నోబిల్ అణు విషాదం
ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు కర్మాగారంలో పేలుడు.. అత్యంత దారుణమైన అణు విధ్వం సం. 1986లో జరిగిన ఈ దుర్ఘటనలో వెలువడిన రేడియేషన్‌తో 4,000 మందికి కేన్సర్ సో కింది.

6. చమురు సంక్షోభం
ఎక్సాన్ కంపెనీ 1989లో అలాస్కాలోని ప్రిన్స్ విలియమ్ సౌండ్‌లో 1.1 కోట్ల గ్యాలన్ల చమురును పారబోసింది. అయితే, ఈ చమురు తెట్ల కారణంగా పర్యావరణానికి ఏర్పడే ముప్పుపై ఎక్సాన్ వాల్డెజ్ ప్రజల్లో చైతన్యం కలిగించింది.

7.అమెజాన్ విధ్వంసం
దశాబ్దాలుగా చెట్లను కొట్టేయడం, సోయాబీన్ సాగు చేపట్టడం, రోడ్లను నిర్మించడం తదితరాల కారణంగా అమెజాన్‌లోని వర్షాధార అడవుల్లో 20 శాతం కనుమరుగయ్యాయి.

8. సముద్రాలకు ఉపద్రవం
కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్‌లో ఎప్పుడూ నిండు గా నీళ్లుంటాయి. కానీ, జలాలు కలుషితం కావడంతో 1992లో అందులోని కాడ్ (పెద్ద సముద్రపు చేప)ల న్నీ చచ్చిపోయాయి. సముద్ర జీవులు అంతరించి.. మానవుల జీవనోపాధీ పడిపోతోంది.

9. మినమట శాపం
జపాన్‌లో ఛిస్సో కార్పొరేషన్ 1932 నుంచి 1968 వరకు పారిశ్రామిక వ్యర్థ జలాలను మినమట నగరం చుట్టుపక్కల ఉన్న సముద్రంలోకి వదిలేసేది. వాటిలోని పాదరసం కారణంగా చుట్టుపక్కల జీవించే వేలాదిమంది అస్వస్థులయ్యారు. ఈ విధ్వంసం పేరిట 'చిస్సో-మినమట' అనే నరాల వ్యాధి పుట్టుకొచ్చింది.

10. ధూళి తుపానులు
1930-40 మధ్యకాలంలో.. అమెరికాలో మార్కెట్ ఆధారిత సాగు పద్ధతులను అవలంబించారు. మైదాన ప్రాంతాల్లో సాగుకు అనుకూలమైన ప్రాంతాలను భారీ గా దున్నేశారు. ఒకే పంటను సాగు చేశారు. ఫలితంగా ఆ దేశ చరిత్రలోనే దారుణమైన పర్యావరణ విధ్వంసం చోటుచేసుకుంది. దీంతో ఏర్పడినధూళి తుపానులు కారణంగా 25 లక్షలమంది నిర్వాసితులయ్యారు. అనంతరకాలంలో భారీ తుపాను వెల్లువెత్తింది.

Thursday, May 27, 2010

వేణువై వచ్చాడు భువనానికి - గాలియై పోయాడు గగనానికీ..!!


ఈ భూవలయం మీద హుందాగా ,అందంగా , గర్వంగా ,ఆదర్శంగా తిరిగిన మనిషి , నవీనబ్రహ్మర్షి వేటూరి ....
అక్షరలోకంలో మీరు వారగా నిలబడి పువ్వుల్ని పూయిస్తున్నప్పుడు ,ఆ పక్క నుంచి వెళుతూ హాయి పొందిన వారిలో నేను ఒకణ్ని,హృదయం ఉన్నవాడవు ,అదునూ పొదునూ ఎరిగిన వాడవూ, పాటతో తెలుగుదనం ,వెలుగుదనం కలిపి పంచిన వాడవు , అజరామరమైన మీ పాట తరతరాలు వింటారు, కల(ళ)లు కంటారు....
మీ అత్మకు శాంతి చేకురాలని కోరుకొంటూ .... రాజ్..



ఆశ ...!

తిండి లేకుండా నలభై రోజులు బ్రతకగలం ,
నీళ్ళు లేకుండా మూడు రోజులు బ్రతకగలం ,
ఫేస్ బుక్/ఇంటర్ నెట్ లేకుండా ఒక రోజు గడపగలం
గాలి లేకుండా ఎనిమిది నిమిషాలు బ్రతకగలం
కానీ ఆశ లేకుండా ఒక్క నిమిషం కూడా బ్రతకలేం !!!

Wednesday, May 26, 2010

Attitude is everything


If

A = 1
B = 2
C = 3
D = 4
.
.
.
X = 24
Y = 25
Z = 26

Then

H+A+R+D+W+O+R+K = 8+1+18+4+23+15+18+11 = 98% only

K+N+O+W+L+E+D+G+E = 11+14+15+23+12+5+4+7+5 = 96% only

L+O+V+E=12+15+22+5 = 54% only

L+U+C+K = 12+21+3+11 = 47% only

Then what makes 100%?

Is it Money? ..... No!!!!! --->(it's 13+15+14+5+25 = 72%)

Leadership? ...... NO!!!! --> (it's 12+5+1+4+5+18+19+8+9+16 = 97%)

Every problem has a solution, only if we perhaps change our attitude.

To go to the top, to that 100%, what do we really need to go further..... a bit more.......

A+T+T+I+T+U+D+E = 1+20+20+9+20+21+4+5 = 100%

It is OUR ATTITUDE towards Life and Work that makes OUR Life 100%

Tyre Burst ..! MBA Exam ..!!


One night four MBA students were boozing till late night and didn't study for the test which was scheduled for the next day.
In the morning they thought of a plan. They made themselves look as dirty and weird as they could with grease and dirt. Then they went up to the dean and said that they had gone to a wedding last night and on their return the Tyre of their car burst and they had to push the car all the way back and that they were in no condition to appear for the test.

The Dean was a Just person so he said that you can have a retest after three days.
After 3 days they said they were ready. On the third day they appeared before the dean. The Dean said that as this was a special condition all four were required to be in separate rooms for the test. They all agreed as they had prepared well in last three days. The test consisted of two question with a total marks of 100.

Q1. Write down your Names. (2 marks)
Q2. Which tyre burst ? (98 marks)

LIFE..!!


Every morning in Africa, a deer wakes up. It knows it must outrun the fastest lion or it will be killed.

Every morning in Africa, a lion wakes up. It knows it must run faster than the slowest deer, or it will starve.

It doesn't matter whether you are a lion or a deer. when the sun comes up,you'd better be running.

Only thought matters ...!


An interesting story to read and practice.

An old man lived alone in a village. He wanted to spade his potato garden, but it was a very hard work. His only son, who would have helped him, was in prison. The old man wrote a letter to his son and mentioned his situation:
"Dear Son,
I am feeling pretty bad because it looks like I won't be able to plant my potato garden this year. I hate to miss doing the garden, because your mother always loved planting time. I'm just getting too old to be digging up a garden plot. If you were here, all my troubles would be over. I know you would dig the plot for me, if you weren't in prison.
Love,
Dad "

Shortly, the old man received this telegram:
"For Heaven's sake, Dad, don't dig up the garden!! That's where I buried the GUNS!!"
At 4 a.m. the next morning, a dozen FBI agents and local police officers showed up and dug up the entire garden without finding any guns.

Confused, the old man wrote another note to his son telling him what happened, and asked him what to do next.
His son's reply was:
"Go ahead and plant your potatoes, Dad.. It's the best I could do for you from here."

Moral:

No matter where you are in the world, if you have decided to do something deep from your heart, you can do it. It is the thought that matters, not where you are.

Marry A Software Engineer Or Not ..!

Husband - Hi Dear,I Am Logged In.

Wife - Would You Like To Have Some Snacks
Husband - Hard Disk Full.

Wife - Have You Brought The Saree.
Husband - Bad Com
mand Or File Name.

Wife - But I Told You About It In Morning
Husband - Erroneous Syntax, Abort, Retry, Cancel.

Wife - Hae Bhagwan ! Forget It.. Where's Your Salary ?
Husband - File In Use, Read Only, Try After Some Time.

Wife - At least Give Me Your Credit Card, I Can Do Some Shopping.
Husband - Sharing Violation, Access Denied.

Wife - I Made A Mistake In Marrying You.
Husband - Data Type Mismatch.

Wife - You Are Useless.
Husband - By Default.

Wife - Who Was There With You In The Car This Morning ?
Husband - System Unstable Press Ctrl, Alt,Del To Reboot.

Wife - What Is My Value In Your Life?
Husband - Unknown Virus Detected.

Wife - Do You Love Me Or Your Computer?
Husband - Too Many Parameters.

Wife - I Will Go To My Dads House.
Husband - Program Performed Illegal Operation,It Will Close.

Wife - I Will Leave You For Ever.
Husband - Close All Programs & Log Out For Another User.

Wife - It Is Worthless Talking To You.
Husband - Shut Down The Computer.

Wife - I Am Going
Husband - Its Now Safe To Turn Off Your Computer.

ఆత్మను అమ్ముకున్న పరిశ్రమ!!


చిత్రాలు మీరు చూడాలని మేం తీయడంలేదు. నాకోసం తీసుకుంటున్నాను. మిమ్మల్ని చూడమని నేను అడగలేదే? చూస్తే చూడండి లేకపోతే లేదు అని తెలుగులో ఓ వెలుగు వెలిగిన దర్శక నిర్మాత అన్న మాటలివి. ఎంత ఆత్మవంచన?! ఒకప్పుడు చిత్ర నిర్మాతలు, దర్శకులు మీకోసమే ఓ మంచి చిత్రాన్ని నిర్మించాం, మీకు తప్పక నచ్చుతుంది అని చెప్పేవారు. అందుకు తగ్గట్టు ఆ చిత్రం సామాజిక, కుటుంబ ప్రయోజనకారిగా వుండేది. కాని ఇప్పటి దర్శక నిర్మాతలు ఎంత ద్రోహబుద్ధితో చిత్రాలు తీస్తున్నారో పై ప్రకటన చూస్తేనే తెలుస్తుంది. మీకోసం మీరు తీసుకున్నప్పుడు, మా ఇళ్ల వద్ద ఇంత ఇంత పోస్టర్స్ వేయడం ఎందుకు? మా వీధిలోవున్న థియేటర్లో విడుదల చేయడం ఎందుకు? మీరొక్కరే మీ ఇంట్లో కూర్చుని ఎన్ని రోజులైనా ఆ చిత్రాన్ని చూసి తరించవచ్చుగదా! పక్కవాడికి హాని చెయ్యకుండా నీవు ఎటువంటి స్వేచ్ఛనైనా అనుభవించవచ్చు అని మనకు రాజ్యాంగం వుంది. కానీ మీరు చేస్తుందేంటి? అర్థ నగ్న పోస్టర్లు వేసి, అసభ్య సినిమా పేర్లుపెట్టి సమాజాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు. పరువుగా తిరిగే కుటుంబాలు వీధులంట వెళ్లాలంటే తలదించుకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. ఒకప్పుడు సినిమా థియేటర్లకు కుటుంబమంతా కలసి వెళ్లేందుకు జంకేవారు. ఇప్పుడు రోడ్లపైకి రావడానికి కూడా భయపడే వాతావరణాన్ని కల్పిస్తున్నారు. తన పిల్లలతో వెళ్లే తల్లికి, తండ్రికి గోడలపై, కటౌట్లపై కనిపించే శృంగార దృశ్యాలు, హీరోయిన్ పెదవి కొరుకుడు, హీరో అండర్‌వేర్ యాడ్స్‌కు ఫోజిచ్చినట్టు బట్టల్లేకుండా కనిపించే దృశ్యాలు, సినిమా వారికి కంటికి ఇంపుగా వుండవచ్చు కాక, సగటు ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నాయన్నది యదార్ధం. నాగరికత పెరిగేకొద్దీ సినిమావారి నాగరికత తిరోగమన దిశవైపునకు సాగుతోంది అనడానికి ఇప్పుడొస్తున్న చిత్రాలే ఉదాహరణ! ఈ చిత్రాల్లో ఒక కథ అంటూ వుండదు. సమాజానికి కాదు కదా, కనీసం ఓ వ్యక్తికైనా మంచి మాట చెప్పలేని అంధకార దశలో వున్నాయి నేటి చిత్రాలు. సినిమా అంటే వినోదంతోపాటు విజ్ఞానం అందించాలి. అలాంటి చిత్రాలు మచ్చుకైనా నేడు కానరావు. సరే...సినిమాలు చెత్త అని ఏనాడో థియేటర్లకు వెళ్లడం మానుకున్నాం. కనీసం మా ఇళ్లలో వుంటూ, అంగడి సరుకులు కొనేందుకైనా వీధుల్లోకి మేం వెళ్లవద్దా? తల్లీపిల్లల్ని విడదీసి రోడ్లపై నడిపిస్తున్నాయి ఇప్పుడొస్తున్న చిత్రాలు. ఒకేసారి ఇద్దరు నడిచి వెళ్లలేని దౌర్భాగ్య స్థితికి చేరుకుంటున్నాం. తలఎత్తి చూస్తే సారీ మా ఆయన ఇంట్లో ఉన్నాడు2 అంటూ రుతిక తన ఒంపుసొంపులతో కనిపిస్తుంది. అసలు ఈ పేరే చాలా జుగుస్సాకరంగా వినిపిస్తుంది. ఇహ సినిమా ఎంత అసహ్యంగా వుంటుందో? తాగుబోతులకోసం, వ్యభిచారులకోసం ఈ చిత్రం తీసినట్టు కనిపిస్తుంది. సమాజంలో యువతను పెడదోవ పట్టించేలా కథలు అల్లుతున్నారు. 3హైస్కూల్2 అనే చిత్రం పబ్లిసిటీకూడా ఇదేస్థాయిలోవుంది. నిండా పదిహేనేళ్లు లేని పిల్లవాడికి 33 ఏళ్ల మహిళతో సయ్యాటలట! హవ్వ...ఎంత భావదారిద్య్రం మూటకట్టుకుంటోందీ చిత్రపరిశ్రమ. యువతను పెడదోవ పట్టించి, దేశానికి మేలు చేయాల్సిన వారిని నిర్వీర్యం చేస్తోంది. ఇదంతా తమాషా చూసినట్టు చూస్తోంది సెన్సార్ బోర్డ్. తన ఫలాలు తాను పుచ్చుకుంటూ! సెన్సార్ సభ్యులు ముడుపులు తీసుకుని సర్ట్ఫికెట్లు అందిస్తున్నారన్న అపప్రద వుంది. లేకపోతే ఏ సమాజం ఎట్లాపోతే నాకేం అని అనుకునే సభ్యులకు కూడా పిల్లలు వుంటారు కదా! వాళ్లు చూడరా! సెన్సార్ సభ్యులైనంత మాత్రాన సమాజంలో వ్యక్తులు కాదా వారు?
పవిత్రమైన గురుశిష్యుల సంబంధాలను కూడా తెలుగుచిత్రపరిశ్రమ వదల్లేదు. వారిద్దరికీ ప్రేమ కల్పించి పెళ్లిళ్లు చేస్తోంది. ఆమధ్య ఓ దెయ్యాల చిత్రాలు తీసి భయపెడతానన్న దర్శకుడికి ఏ కథ రాయాలో తెలీక 3రెండు దెయ్యాల ప్రేమ కథ2ను అల్లుకున్నాడట. అది కూడా త్వరలో మన వీధిలో సినిమాగా మారబోతోంది. అంత పాతాళ స్థాయిలోకి దిగి మనవాళ్లు చిత్రాలు నిర్మిస్తుంటే పరిశ్రమ పచ్చగా పదికాలాలపాటు నిత్య కల్యాణం పచ్చతోరణంలా ఉండ కూడదని దీవించని ప్రేక్షకులెవరు? ముఖ్యంగా పిల్లల్ని కన్న తల్లిదండ్రులెవరు?
సెన్సార్ వారు సినిమా చూసాక ఎ, యు సర్ట్ఫికెట్లు ఇచ్చేసి దుమ్ము దులుపుకుంటే సరిపోతుందా? ఆ సినిమా తాలూకు ప్రభావం సమాజంపై ఏ విధంగా వుండబోతుంది అన్న ప్రశ్నలు వారికి రావా? వారు చదువులేని వారు కాదే! అనేక రంగాల్లో ఆరితేరిన వారినే కదా సెన్సార్ సభ్యులుగా నియమిస్తుంది. అందులో యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా వుండొచ్చు. వారికైనా ఇటువంటి గురుశిష్యుల ప్రేమ చిత్రాలు సమాజానికి హాని చేస్తాయని తెలీదా? సినిమా అంటే గతంలో మహిళా ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేసేవారు. కానీ ఇప్పుడు యువకులకోసమే చిత్రాలు తీస్తున్నామని పరిశ్రమ చెబుతోంది. యువతను ఇలా దేనికీ పనికిరానివారిగా ఎందుకు చేయదలుచుకున్నారో ఇటువంటి చిత్రాలను తీసే నిర్మాత, దర్శకులు, నటులను ప్రశ్నించాలి. చిన్నపిల్లలను అటువంటి నటన చేయడానికి అమ్ముకున్న బాలనటుల తల్లిదండ్రులను కూడా విచారణకు స్వీకరించాలి.
ఇలాంటి చెత్త చిత్రాలు ప్రజలు తిరగ్గొట్టినా, మా సినిమాలో చాలా గొప్ప సందేశమున్నదని మీడియా ముందు చెప్పుకునే దర్శక నిర్మాతలను సంఘ బహిష్కారం చేయాలి. ఇటువంటి వారి వలన సంఘం నాశనం అవుతుంది. కాసులకోసం ఎంతమంది జీవితాలను బలిపెడతారు? చిత్రాలు చూసి నేడు ఉపాధ్యాయులు, శిష్యులు పెళ్ళిళ్లు చేసుకున్న ఉదంతాలు చూస్తున్నాం. ఉపాధ్యాయ వృత్తి గౌరవించే ఏ ఉపాధ్యాయుడు తన బిడ్డలతో సమానమైన శిష్యులను పెళ్లి చేసుకోడు. ఇలా జరుగుతున్నాయంటే సంఘంలో అదో వికృతి. అర్హత, శిక్షణ లేని తక్కువ జీతంతో పనిచేసే వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. అటువంటి నైతిక విలువలు లేని ఉపాధ్యాయులపై ప్రభుత్వం చర్య తీసుకోవాలి. విద్యా వ్యవస్థలో గురుతర బాధ్యతను నెరవేర్చలేక కీచకులుగా మారి పోలీసులను, పంచాయతీ పెద్దలను, కోర్టులను ఆశ్రయించి, డబ్బు వెదజల్లి, తిరిగి ప్రభుత్వ జీతాలు తీసుకునే అపర రాక్షసులు తయారవుతున్నారు. పైగా ఆ సినిమాలో అలా చేయలేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ చూస్తూ మహిళా సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. ఈ చర్యలు మహిళలను ప్రతీకారానికైనా సిద్ధం చేస్తుంది లేదా మానసికంగా నైనా కుంగిపోతారు. ఇలాంటి చిత్రాలు సమాజానికి స్లో పాయిజన్‌లా పనిచేస్తూ, వ్యవస్థను నాశనం చేసే దిశగా నిర్మాణ మవుతున్నాయి. ఇప్పటికైనా పరిశ్రమలోని పెద్దలు, చిత్రకథలపట్ల సినిమా పేర్లపట్ల కొన్ని సూచనలు చేస్తూ చిత్రాలు నిర్మించాలని చెప్పగలగాలి. దానికి అందరు పెద్దవారూ సహకరించాలి. నా మనవళ్లు, నా కొడుకుల చిత్రాలు ఆడితే చాలు..దేశం ఏమైతే నాకెందుకు అని దొంగ నిద్ర నటించకండి. జీవితంలోనూ నటించకండి. ఇప్పటికైనా మేల్కొని సినిమా మాధ్యమం అధ్వాన్నమవుతున్న తీరుకు స్పందించండి. అలా చేయలేనినాడు మీకీర్తి తారాస్థాయి అని కలలు కనకండి. చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్న వాస్తవాన్ని గుర్తించండి. సినిమా అంటే డబ్బుల పాలు పితికే ఆవు అని అనుకోకండి. అనేకమంది ప్రేక్షకుల కలలతీరమని భావించండి. ఆ కలల తీరాన్ని అందమైన హరివిల్లుగానే వుంచే ప్రయత్నం చేయండి అప్పుడు ఎన్ని కాలాలైనా మీ కీర్తి తీరం పక్కన లైట్‌హౌస్‌లా కాంతులు వెదజల్లుతునే వుంటుంది. దయచేసి చెత్త, జుగుప్స కలిగించే చిత్రాలు, పలకడానికి ఇబ్బందిపడే పేర్లు, చూడడానికి వీల్లేని వాల్‌పోస్టర్లను కాల్చివేయండి. ఆత్మను అమ్ముకుంటున్న పరిశ్రమకు కౌన్సిలింగ్ ఇవ్వండి. ప్రేక్షకుల ఆత్మగౌరవాన్ని కాపాడండి!!

శ్రీ శ్రీ కి జన్మదిన శుభాకాంక్షలతో ..


పేదోడి స్వేదానివై ... కార్మికుడి నాదనివై ... అణుగారిన వర్గాల వాదనివై ... అభాగ్యుల పాలిట వేదానివై ... అస్సహయుల ఘోషలో ఆవేశపు శ్వాసవై... నిస్సహాయుల బాధలో అక్రోశపు రాతవై ... జ్వలించే గుండెలో స్కలించే లావవై .... అశ్రువులను అక్షరాలుగా... కన్నీళ్లను కవిత్వంగా... అనువదిస్తూ.... నీ కలం ఇక సామాన్యుని బలమై ... సతమతాల సమాజాన్ని నిలదీస్తూ శ్రామికుడి గళమై... అసమర్ధపు ప్రభుత్వం పై నినాదిస్తూ. ... కర్షకుడి హలమై ... బండబారిన భూమిని మొండిగా చీలుస్తూ ...... విశాల భారతావని నుదిట నెత్తుటి తిలక0 దిద్దగా మళ్లీ ఎప్పుడు వస్తావ్ ప్రభు.... మేఘాలను దాటి... రాగాలను మీటి .. పంచభూతాలు ప్రళయ గీతాలు ఆలపించగా... అష్ట దిక్కులు విలయ నాట్యం చెయ్యగా ... శూన్యంలో నుంచు సుధీర్గ ప్రయాణం చేస్తూ... దండెత్తి రా ప్రభు మా భూమికి .. మరో ప్రపంచపు పరుగులలో విశ్రమించని కవివై .. మహాప్రస్తానపు వెలుగులలో అస్తమించని రవివై .. మహా కవి శ్రీ..శ్రీ..గారికి జన్మదిన శుభాకాంక్షలతో .... రాజశేఖర్...!

"బగ్గు"వద్గీత - IT బోధ ...!


"బగ్గు"వద్గీత - బగ్గులు ఎందుకు వస్తాయంటే?

కలియుగాంతం ఆసన్నమయింది, బ్రహ్మ తర్వాత యుగానికి శ్రీకారం చుట్టడానికి ఈ సారి వెరైటీగా కంప్యూటర్ లో సృష్టి మొదలు పెడదాం అనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా ప్రాక్టీస్ కోసం ఏదైనా సాప్ట్ వేర్ కంపనీ లో చేరదాం అని నిర్ణయించుకొన్నాడు. తనతో పాటు ఇంకొంత మంది దేవుళ్ళని కూడా ప్రాక్టీస్ కి అహ్వానించాడు.

బ్రహ్మ సాప్ట్ వేర్ డెవలపర్ గా జాయిన్ అయ్యాడు. సాప్ట్ వేర్ ని సృష్టించటం బ్రహ్మ పని. బ్రహ్మండంగా కోడింగ్ మొదలుపెట్టాడు. కాని అప్పుడప్పుడు అలవాటులో పొరపాటు గా బగ్గులు కూడా వచ్చేవి.
బ్రహ్మ సృష్టించిన బగ్గుల వల్ల ప్రాజెక్ట్ కేమి సమస్యలు రాకుండ కాపాడడం, స్థితి కారకుడైన విష్ణువు పని కాబట్టి విష్ణు మూర్తి బ్రహ్మ కి టీం లీడర్ గా జాయిన్ అయిపోయాడు.

లయ కారకుడైన మహేశ్వరుడు కూడా టెక్నికల్ డైరెక్టర్ లాగా జాయిన్ అయ్యి బ్రహ్మ, విష్ణువులు సృష్టించి, కాపాడుతూన్న (మెయింటైన్ చేస్తున్న ) ప్రాజెక్ట్ లన్ని లయం(స్క్రాప్) చేస్తూ ఉండెవాడు. పొద్దున్న "C" లో చేసిన ప్రాజెక్ట్ ని స్క్రాప్ చేసి సాయంత్రం "C++" లో చేయమనే వాడు. తర్వాత రోజు దానిని స్క్రాప్ చేసి "java" లో చేయమంటూ తన ధర్మాన్ని నిర్వర్తించేవాడు.

ఈ రకం గా ప్రాజెక్ట్ లన్నీ స్క్రాప్ అవడం తో విసుగు చెందిన విష్ణు మూర్తి, బాగా ఆలోచించి ఇంకా కొంతమందిని టీం లో పెట్టుకుని ఒక్కక్కరి చేత ఒక్కో టెక్నాలజీ లో ప్రాజెక్ట్ డెవలప్ చేయించి ఈ సారి అయినా ప్రాజెక్ట్ "OK" చేయించుకోవలని అనుకున్నాడు. వెంటనే కృష్ణావతారం లో తన అనుంగు మితృడైన అర్జునుడిని, అర్జునుడి కన్నా ప్రతిభా పాటవాలు కల ఏకలవ్యుడిని టీం లో జాయిన్ చేసుకున్నాడు.

ఏకలవ్యుడు ఏ పని ఇచ్చినా తన శక్తి సామర్ధ్యాలతో వెంటనే పూర్తి చేసేసేవాడు. ఒక వేళ తనకి ఆ టెక్నాలజీ రాకున్నా, ఆ టెక్నాలజీని గురు ముఖంగా నేర్చుకోకపొయినా మనసులో గురువు గారిని ధ్యానించుకొని, గూగుల్ లో సెర్చ్ కొట్టి ప్రాక్టీస్ చేసి నేర్చేసుకొనేవాడు(కాపీ పేస్ట్ చేసేవాడు). కాని పాపం అర్జునుడు అలా కాదు. గురు ముఖంగా విననిదే ఏ టెక్నాలజీ నేర్చుకొలేకపోయెవాడు.

ఒక సారి అర్జునుడు చేసిన కోడ్ లో కుప్పలు తెప్పలు గా బగ్గులు వచ్చాయి. సాయంత్రానికి అన్ని బగ్గులు ఫిక్స్ చేయాలని విష్ణు మూర్తి డెడ్ లైన్ ఇచ్చి వెళ్ళాడు. అర్జునుడు మహా భారత యుధ్ధం లో కౌరవ సేన లా ఉన్న బగ్గులని చూసాడు. భయపడ్డాడు, విలపించాడు. అస్త్ర సన్యాసం (రాజీనామా) చేస్తున్నాని ప్రకటించాడు.

అర్జునుడి మాటలు విన్న విష్ణు మూర్తి వెంటనే కృష్ణావతారం లోకి మారిపోయి
"అర్జునా !
బగ్గు సృష్టించేది ఎవరు, ఫిక్స్ చేసేది ఎవరు, ఇదంతా మిధ్య నాయనా!
బగ్గు ఒక్కటె శాశ్వతము, త్నిత్యము, సత్యము. అది అగ్నిచే కాల్చబడదు. నీటిచే తడుపడదు. కోడు చే ఫిక్స్ చేయబడదు.!
మానవుడు ఒక వస్త్రాన్ని వదలి వేరొక వస్త్రాన్ని ధరించినట్టు బగ్గు ఒక రూపాన్ని వదలి వేరొక రూపాన్ని ధరిస్తుంది.
నువ్వు ఏం బగ్గు సృష్టించావని నీవు బాధ పడుతున్నావు. ఈ రోజు నీకు అసైన్ చేసిన బగ్గు నిన్న వేరొకరికి అసైన్ కాలేదా, రేపు వేరొకరికి అసైన్ కాదా?"
అని సాప్ట్ వేర్ జీవిత (లైఫ్ సైకిల్) పరమార్ధాన్ని వివరించ గానే దుఃఖాన్ని విడచి కార్యొన్ముఖుడై బగ్గులన్ని ఫిక్స్ చేసాడు.

అప్పటి నుంచి సాప్ట్ వేర్ ఉద్యోగులందరు తమ తమ స్థానాలలో త్రిమూర్తులు, అర్జునుడు, ఏకలవ్యుడు ఏర్పరిచిన సాంప్రదాయాలని పాటిస్తూ బగ్గులని ఒక రూపం నుంచి మరొక రూపానికి మారుస్తునే ఉన్నారు.

గమనిక : ఈ కథ పది సార్లు పారాయణ చేసిన వారికి పది బగ్గులు తక్కువ వస్తాయి !!!

Fiction @ TV Channel - TV-7


ఛానెల్ లొ న్యూస్ కి చిన్న ఉదాహరణ (Fiction)

మనం రోడ్ మీద వెళ్తూ ఉంటాం. ఒక కుక్క పిల్ల కాలు విరిగి కుంటుంతుంటుంది. మనకి టైం ఉంటె ఆగి దానికి ఏమి కావాలొ చూస్తాం, లేదు అంటె అయ్యో పాపం అని జాలి పడి వెళ్ళిపోతాం.

tv-7 రిపోర్టర్ వెళ్తున్నాడు, వెంటనె tV-7 ఆఫిస్ కి ఒక ఫొన్ వెల్తుంది, వాడు కెమెరామెన్ ని పంపుతాడు.

ఇక మొదలు........

క్రిష్ణ ఆ కుక్క పరిస్తితి ఎలా ఉంది? ఎప్పటి నుంచి అక్కడ ఉంది?

ఈ కుక్క మార్నింగ్ నుంచి ఇక్కడే ఉంది, ఇప్పుడు కుంటుంతుంది......స్వప్న

ఆక్కడి వాళ్ళు ఏమన్న చెబుతున్నార?...క్రిష్ణ

స్వప్న...ఇక్కడి వాళ్ళు ఇది ఒక కుక్క అని, దాని కాలుకు దెబ్బ తగలటం వల్ల కుంటుతుంది అని చెప్తున్నారు. ఈ విదం గ గతం లొ ఆ కుక్క ఈ area లొ ఇలా కుంటలేదని, ఇదె తాము మొదటి సారి చూడటం అని చెప్తున్నారు

కుంటుతున్న కుక్క స్పందన ఎలా ఉంది? .....క్రిష్ణ

కుక్క ప్రస్తుతం కుంటుతుంది స్వప్న. ఈ విదం గ కాలు కు దెబ్బ తగలటం కొత్త అనుకుంట, అందుకె కుంటటం రాక ఇబ్బంది పడుతుంది. మాట్లాడించటనికి ప్రయత్నించిన అది సమాధానం చెప్పకుండ, మూలుగుతుంది.....స్వప్న

థాంక్ యు క్రిష్ణ, ఎప్పటికప్పుడు తాజా పరిస్థితి సమీక్షిస్తు ఉండటానికి మీకు కాల్ చేస్తూ ఉంటాం.

ఇది గాయపడి కుంటుతున్న కుక్క స్థితి మీద మా క్రైం ప్రతినిధి క్రిష్ణ అందించిన వివరాలు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్..
బ్రేక్ తర్వాత కుక్కలు-కుంటుడు అంశం పై చర్చింటానికి ప్రముఖ Doctor కుక్కుటేశ్వర రావ్ గారు మన Studio కి వస్తున్నారు..

బ్రేక్ తర్వాత..........

సుధాకర్ : చెప్పండి కుక్కుటేశ్వర్ రావ్ గారు గతం లొ మీరు ఎప్పుడైన ఇలా కుక్కలు కుంటటము చూసార? ఒక వేళ చూస్తె ఏ జాతి కుక్కలు కుంటటము చుసి ఉంటారు.

కుక్కుటేశ్వర్ : ఈ విదం గ కుక్కలు కుంటటం ఇది మొదటి సారి కాదు. ఫ్రపంచవ్యాప్తం గ ఎన్నో జాతుల కుక్కలు, ఎన్నో సందర్భాల్లొ ఇలా కుంటినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. కుంటటానికి జాతి తో సంబందం లెదు.

సుధాకర్: అంటె కుక్కలు కుంటేటప్పుడు వాటికి ఏమన్న బాధ ఉంటుందా? ఉంటె ఎటువంటి బాధ?

కుక్కుటెశ్వర్ : బాధ లొ రకాలు ఉండవండి. కుంటెటప్పుడు general గ దెబ్బ తలిగిన కాలు కి నొప్పి ఉంటుంది అని Dog's Medical Science లొ గట్టి ఆధారాలు ఉన్నాయి.

సుధాకర్ : తాజా పరిస్థితి చెప్పేందుకు మా క్రైం ప్రతినిధి క్రిష్ణ టెలి ఫొన్ లొ సిద్దం గ ఉన్నారు...క్రిష్ణ చెప్పండి..ఆ కుక్క పరిస్థితి ఎలా ఉంది.

క్రిష్ణ : (చెవిలొ ear piece పెట్టుకుని బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు..)

క్రిష్ణ చెప్పండి..ఆ కుక్క ఫరిస్థితి ఎలా ఉంది?

సుధాకర్ ... కుక్క మూలుగుతుంది, ఇప్పుడె blue cross వాళ్ళు దానిని తీసుకువెళ్ళారు.

కుక్క కాలు కి దెబ్బ తగిలింది, దాని ఇతర శరీర భాగాలు ఎలా ఉన్నయి?...క్రిష్ణ

సుధాకర్, కుక్క కాలు కి మాత్రమే దెబ్బ తగిలింది. కాని ఈ కుక్క తోక వంకర గా ఉంది.

వంకర అంటె ఎలా ఉంది...క్రిష్ణ (ఇప్పుడు సుధాకర్ మొహం లొ expressions ఇంకెక్కడా చూడలేము, శత్రువు టాంకర్ ని ద్వంసం చెయ్యటానికి wait చెస్తున్న soldier face లొ తప్ప)

సుధాకర్ వంకర గ అంటిచుకుని ఉంది, నేను ఇప్పటికి దానిని straight చెయ్యటనికి try చెతున్నాను కాని అది చుట్టుకుపొతుంది. బహుశ కాలు కి దెబ్బ తగలటం వల్ల అని నా ఉద్దెశం.

థాంక్ యు క్రిష్ణ....కుక్కుటెశ్వర్ గారు, కాలు కి దెబ్బ తగలటం వల్ల తోక వంకర అయ్యి ఉంటుంది అని మా ప్రతినిధి క్రిష్ణ చెప్తున్నారు, దీని పై మీ స్పందన ఏంటి?

స్పందన అంటె ఏమి ఉంటుంది రా పుండకార్ వెధవ...కుక్క తోక కాలు కి దెబ్బ తగలటం వల్ల వంకర అయ్యేది ఏంటి ర ధేడ్ దిమాగ్ గ. ఏమి మనిషివి ర నువ్వు, ఇప్పటి వరకు నువ్వు రాసి ఇచిన answers చదివాను, ఇంక నా వల్ల కాదు, నా టి మరిగిపొతూ ఉంటుంది. బంగారం లాంటి మల్లయ్య అనే పేరు మార్చి కుక్కుటెశ్వర్ రావ్ అని మార్చి, షర్ట్, పాంట్ రెంట్ కి తెచ్చి నాకు ఇచ్చి డాక్టర్ లాగ act చెయ్యలా? ఇల act చేస్తె నా tea కొట్టు నుంచి ఎదురు గ ఉన్న మీ tV-7 office కి రొజు 100 tea లు ఆర్డెర్ ఇస్తారా. మనస్సాక్షి ఉందంట్ర వెధవ *్*్*్*.దొంగ నా &%%్**( గాలి న &$%్**.. మీ బతుకులు చెడ....)

(ఇలా తిడుతు ఉండగానె, tV-7 లోగొ వచ్చి, మెరుగైన సమాజం కొసం చుస్తూనే ఉండండి tV-7 అని voice వినిపించి ads రావటం మొదలవుతాయి..)

Thanks 2 Face Book..

Thanks to Facebook for giving chance to break my SHELL and now able to FACE the reality ...!!! :) :) :)

Top 22 Things@ USA RETURN


Top 22 things an Indian does after returning to India from "US".

22. Use Nope for No and Yep for Yes.
21. Tries to use credit card in road side hotel.
20. Drinks and carries mineral water and always speaks of health conscious.
19. Sprays duo such so that he doesn’t need to take bath.
18. Sneezes and says ’Excuse me’.
17. Says "Hey" instead of "Hi". Says "Yogurt" instead says "Curds". Says "Cab" instead of "Taxi". Says "Candy" instead of "Chocolate". Says "Cookie" instead of "Biscuit". Says "Free Way" instead of "Highway". Says "got to go" instead of "Have to go". Says "Oh" instead of "Zero", (for 704, says Seven Oh Four Instead of Seven Zero Four).
16. Doesn’t forget to crib about air pollution. Keeps cribbing every time he steps out.
15. Says all the distances in Miles (Not in Kilo Meters), and counts in Millions. (Not in Lakhs)
14. Tries to figure all the prices in Dollars as far as possible (but deep down the heart multiplies by 43 times).
13. Tries to see the % of fat on the cover of a milk pocket.
12. When need to say Z (zed), never says Z (Zed), repeats "Zee" several times, if the other person unable to get, then says X, Y Zee(but never says Zed)
11. Writes date as MM/DD/YYYY, on watching traditional DD/MM/YYYY, says "Oh! British Style!!!!"
10. Makes fun of Indian Standard Time and Indian Road Conditions.
9. Even after 2 months, complaints about "Jet Lag".
8. Avoids eating more chili (hot) stuff.
7. Tries to drink "Diet Coke", instead of Normal Coke.
6. Tries to complain about any thing in India as if he is experiencing it for the first time.
5. Pronounces "schedule" as "skejule", and "module" as "mojule".
4. Looks speciously towards Hotel/Dhaba food.
3. From the luggage bag , does not remove the stickers of Airways by which he traveled back to India, even after 4 months of arrival.
2. Takes the cabin luggage bag to short visits in India, tries to roll the bag on Indian Roads. Ultimate one:
1. Tries to begin conversation with "In US ...." or "When I was in US..."

---------------------------------RAJ------

Tuesday, September 16, 2008

Spoof link on Greatandhra news ...

My spoof link got published on online web portal www.greatandhra.com...Click on below link ..
http://www.greatandhra.com/ganews/viewnews.php?id=9901&cat=15&scat=16
Urs
Raj

Thursday, August 28, 2008

నా జీవన గమనములో..! నేను-నా అనుభ(భా)వాలు ..!!


నేను బారత దేశం లో పుట్టినందుకు గర్వ పడుతున్నాను ...
నన్ను అర్ధం చేసుకోవడానికి చాలా టైమ్ పడుతుంది . మొదటిసారి చూస్తే వీడెంటి ఇలా ఉన్నాడు అనిపిస్తుంది . అలవాటయిన కొద్దీ మంచోడేమో అనిపిస్తాను. ఇంకొంచెం దగ్గరైతే చాలా తియ్యగా అనిపిస్తాను. ఇవి నా మాటలు కావు నా మిత్రుల గుండెచప్పుళ్లు . పుట్టాం!! ... పెరిగాం!! ... పోయాం!!... అన్నట్టు కాకుండా చేతనైనంత సాయం చేసి ఇంకో నలుగురికి ఆదర్శంగా నిలవాలన్నది నా ఆశ. ఎప్పుడూ నవ్వుతూ ,సంతోషంగా ఉంటా! గంట సీరియస్ గా ఉంటే జీవితంలో అరవై నిమిషాలు ఎందుకు పనికి రాకుండా పోయాయని అనుకుంటా.చుట్టూ జనం ఉండాలి నాకెప్పుడూ...ఒంటరితనం భరించలేను! నా అభిమతం వాస్తవికతకు దగ్గర, ఆశావాహధృక్పధం నా ఆయుధం ..
నాకు తెలీని విషయం నాకన్నా ఎంత చిన్నవాళ్లు చెప్పినా వింటాను.. "ఈ క్షణపు ఓటమే మరు క్షణపు గెలుపేమో ఈ నిమిషపు గెలుపే జీవితాన మలుపేమో " అని తలుస్తూ వాస్తవంలో బతుకుతూ భావుకతని ఆరాధిస్తూ తెలుగన్నా, తెలుగు సంస్కృతి అన్నా ఎంతో ఇష్టపడే సామాన్యుడిని నేను..

"కవితలు చెప్పే హృదయం వుంది !
ప్రేమించే మనసు వుంది ..
మనసులొన మంచి ఊహ వుంది ...
ఊహల లోకం లో ఒక ఆశ వుంది ..
కలసి వుండే కోమలి యెక్కడ ఉందో?..
చెప్పాలి అంటే, చాలా వుంది.. వినే ఓపిక ఉందా.....?"..!!

నాకు నచ్చిన కొన్ని మంచి వాక్యాలు మీకు కూడా నచ్చితే ఆచరించండి .....
1."ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్ని విధి పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరే ఆగిపోయేవాడు అనామకుడు గానే మిగిలిపోతాడు"...
2.'అంతా తనదే' అన్నది మమకారము.'అంతాతనే' అన్నది అహంకారము...
3."నేడు రేపటికి 'నిన్న' అవుతుంది.నిన్నటి గురించి రేపు బాధ పడకుండా వుండాలంటే,నేడు కూడా బావుండాలి"...
4."మలుపు తిరగటానికి కరెక్ట్ ప్లేస్..Dead End....'అంతే అయిపోయింది ఇంకేమీ లేదు' అనుకున్నచోట ఆగిపోకు. ప్రక్కకి తిరుగు. మరోదారి కనపడుతుంది"...
5."నిన్నెవడయినా తప్పు పట్టాడంటే,నువ్వు తప్పు చేస్తునావని కాదు.నువ్వు చేస్తున్నపని వాడికి నచ్చలేదన్నమాట"...
6."ఓడిపోయేవాడు ఒక్కసారే ఓడిపోతాడు.గేలిచేవాడు తొంబైతొమ్మిదిసార్లు ఓడిపోతాడు.వందసార్లు ప్రయత్నిస్తాడు కాబట్టి"...
7."నిన్నటినుంచి పాఠం గ్రహించి,రేపటి గురించి కలలుకంటూ ఈ రోజుని ఆనందించు.కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్దం చేసుకోకు.ఇవ్వటంలో నీకు అనందం వుంటే ఇస్తూ అనందించు.అలా కాని పక్షంలో నీ అనందానికి అడ్డువచ్చే వారినందరిని నీ దినచర్య నుండి తోలగించు.రాజీపడి మాత్రం బ్రతక్కు"...

మర్చిపొయానండోయ్ అమెరికా విషయాలు చెప్పడం ...!అమెరికా వచ్చిన కొత్తల్లో బాగా ఖాళీ ఉండేది...అప్పుడు అనుకునే వాడిని, నేను ఎప్పుడు చూసినా ఇంత ఖాళీగా ఉంటున్నా, మరి అందరూ "బిజీ బిజీ లైఫ్. తినడానికి కూడా టైం ఉండదు, రెండు మూడు రోజులకొకసారి వండుకుని, దాచుకుని మరీ తింటూ ఉంటాం, స్నానానికి కూడా టైం ఉండదు" అని అంటూ ఉంటారేంటబ్బా అని ఒక ధర్మసందేహం వస్తూ ఉండేది ! కాని ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే తయారు అయింది !! ఆఖరికి ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడటానికి సమయం కేటాయించలేకపోతున్నా ! అలా అని వెనక్కు తిరిగి చూస్తే, పెద్దగా చేసింది ఎమీ లేదు.. !బహుశా ఇది నాతో నేను చేసే చెసే నిత్య సంఘర్షనేమో ..? నదికి - విధికి ఎదురీదడం కష్టమని చెప్పిన మహానుభావుల వాక్యాలు ఒక్కోసారి నిజమేమో అనిపిస్తుంటుంది ..!అమెరికా వచ్చి సంవత్సరం దాటింది! నా బాధలు చెప్పుకొనేంత పెద్దవి కాదు ..అలా అని మర్చిపోయెంత చిన్నవీ కావు..ఇంక వాగడం అంటారా అది సరేసరి ..
అంతా యాంత్రికం -తాంత్రికం -$ మాంత్రికం ....!
గంటకెంత .? నీకెంత ? నాకెంత ..? నాకేంటి ...? వీటి సమాధానాల పునాదుల మీదనే అన్ని నిర్ణయాలు తీసుకోబడతాయి. ఈ నాలుగు కూడళ్ళ $ చౌరస్తాలోనే జీవితానికి సంబందించిన కీలక నిర్ణయాలు తీసుకోబడతాయి ఎక్కువమంది NRI(Non Returning Indian) లలో ..
దేవుడూ - దెయ్యమూ $
వియ్యానికి - కయ్యానికి $
మాటామంతికి - ముభావానికి $
ఆనందానికి -దుఖ్హానికి $
ఆవేశానికి - ఓర్పుకి $
గెలుపుకి - ఓటమికి $
జగమంతా డాలర్ ..డాలర్ ..డాలర్ ..!!
భావావేశానికి కాసేపు అడ్డుకట్టవేసి, సొంత విషయానికి వద్దాం ....!!
ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా, "ఎప్పుడొస్తున్నావయ్యా ?" అని పలికే నాన్న గంభీర స్వరం.... "నిన్ను చూడాలనుంది నాని" అని పలికే అమ్మ కమ్మని మాటలు విన్నప్పుడల్లా, దేవుడు మనిషికి రెక్కలు ఎందుకివ్వలేదా అని అనిపించేది.... చక్కగా ఇక్కడ ఎగిరి అక్కడ వాలి అందరినీ ఒకసారి చూసి వచ్చేయచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది !మళ్ళీ నా గొంతులో బాధ కనిపిస్తే వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని, కొంచెం స్వరం పెంచి, "ఇంకెంతమ్మా ఒక ఏడాదేగా" అని చెప్తూ ఉంటా !ఇంకా మీతో పంచుకోవడనికి నా మదిలో చాలా మాటలున్నాయి...మళ్ళీ ఇలాగే సమయం దొరికినప్పుడు మిమ్మల్ని పలకరిస్తా !! అంత వరకూ సెలవు !

చిరునవ్వుతో..
మీ రాజ్

Wednesday, August 27, 2008

TV9 Program - Directors Special on 20,July 2008

This video is being telecasted on TV9 Telugu News Channel frequently in different programs like “Directors Special" & other Special focus events. I am really thrilled to see my spoof on one of the most viewed news Channel. that was telecasted recently on 20, July 2008.

Glad to see my spoof video at the beginning of the program in full length.

Thanks toTV9 & YouTube viewers.

Urs
Raj

" A Chance is important to prove any talent".




Thursday, August 21, 2008

Bench Lite's Version 2 - Don tho games vaddu - H1B's Lechi Potaay ...!

Here I tried to make a second version of Bench lites by adopting the character of khandada,performed by Dr.Brahmanandam (great Tollywood comedian) from the all time hit movie "Money".

I did an experiment on the script & tried my best to serve a different flavor by changing the climax ..tried for better photography ...Do u believe that the entire video was just shot by Sony DSC-W80 digital camera & edited in windows movie maker ?

I myself gave voice over for both the versions of the spoof .Sincere thanks to my team.

Special thanks to my well wishers - Sree Kilaru, Bala Peddi,Eswar, Vamsi kolli, Venumadhav, Sarat.
By making spoofs,I really got a chance to improvise my set based skills & believe that this helps in improving my skills based on critics,reviews & feedback.


Urs
Raj
-" Creativity is the major thing which you can't adopt".


Bench Lite's Version 1 - Karo Karo Jara Jalsa ....!

How IT Bench folks deal with their day to day life in USA....Every individual is smart enough, has his own style & approach when dealing anything new...

Handling a single task is not a big deal, multitasking & being successful in that, is quite difficult thing. Watch their life style & their ability to manage things when going gets tough. This portrays day to day realities in the American IT world.

$ dreams make people mechanical ....! Money2india can't be everything..!!

Feel the reality,
Realize through humanity,
Remember your responsibility,
Keep your originality


Urs
Raj

-"If you fail to solve the problem, at least try to manage it ..!" .

Bommarillu Spoof - Software Programmer Vs Project Manager

This is my first spoof, where I gave a serious try to check my writing/screenplay skills. ..& tried to map the discussion between Siddarth & Prakash Raj in "Bommarillu "- a telugu super hit. Here you can watch the feelings of an IT programmer & a Project Manager ....Fortunately I got very good performers in Mr.Kalyan Gorrepati & Srinivas Deme..
This video is getting tremendous response on youtube ... running towards 100k hits...recently telecasted on TV9 telugu news channel.

Youtube link;
http://www.youtube.com/watch?v=GmD82B9zEVA
Urs
Raj

- "Every man's life starts with a full bag of luck & an empty bag of experience. The trick is to fill the bag of experience before the luck runs out."